విధుల్లో చేరిన వారిపై దాడి చేసిన ఆర్టీసీ కార్మికులు.. డ్రైవర్ ను చితకబాదిన వైనం!
- మహబూబ్ నగర్ లో విధుల్లో చేరిన ఉద్యోగులపై దాడి
- డ్రైవర్ తాజుద్దీన్ ను చితకబాదిన కార్మికులు
- పోలీసులు, కార్మికులకు మధ్య తోపులాట
ఇదే సమయంలో బస్సులు బయటకు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే భారీ సంఖ్యలో అక్కడకు చేరుకున్న పోలీసులు కార్మికులను అడ్డుకున్నారు. డిపో నుంచి బయటకు పంపించారు. ఈ సందర్భంగా పోలీసులు, కార్మికులకు మధ్య తోపులాట జరిగింది. అయితే, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఎవరిపైనా కేసు నమోదు చేయలేదు. అనంతరం కార్మికులు రోడ్డుపైకి వచ్చి నిరసన చేపట్టారు.