'సైరా'లో కనిపించని 8 కోట్ల సాంగ్.. చరణ్ నిర్ణయం కోసం ఫ్యాన్స్ వెయిటింగ్!

  • దేశభక్తి చిత్రంగా రూపొందిన 'సైరా'
  • పలువురు ప్రముఖుల నుంచి ప్రశంసలు 
  •  యూట్యూబ్ లో రిలీజ్ చేయమంటున్న ఫ్యాన్స్
చిరంజీవి .. నయనతార .. తమన్నా ప్రధాన పాత్రధారులుగా 'సైరా' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఈ సినిమాను చూసి, గొప్ప దేశభక్తి  చిత్రంగా ప్రశంసించారు. అలాంటి ఈ సినిమా కోసం చిరంజీవి - తమన్నాపై ఒక పాటను చిత్రీకరించారు. 8 కోట్ల ఖర్చుతో ఈ పాటను చిత్రీకరించడం విశేషం.

అయితే కథాగమనానికి ఈ పాట అడ్డుపడుతోందని భావించారు. ఎక్కడా ఇరికించే  ప్రయత్నం చేయవద్దని చరణ్ చెప్పడంతో పక్కన పెట్టేశారు. అంత ఖరీదైన పాట ఎలా వుందో .. ఏ స్థాయిలో చిత్రీకరించారో అనే ఆసక్తి మెగా అభిమానుల్లో వుండిపోయింది. ఈ పాటను చూడాలనే కుతూహలంతో, యూట్యూబ్ లో విడుదల చేయవలసిందిగా వాళ్లంతా చరణ్ ను కోరుతున్నారు. సోషల్ మీడియా ద్వారా చరణ్ ను రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి చరణ్ ఏం చేస్తాడో చూడాలి.
Go Back to Shorts
Chiranjeevi
Nayanatara
Thamannah

More Telugu News