Rahul: ఇద్దరూ ఇష్టపడితే... పునర్నవితో వివాహానికి ఓకే చెప్పిన రాహుల్ తల్లిదండ్రులు!

షార్ట్స్‌లో చూడండి
ఇటీవల ముగిసిన టాలీవుడ్ రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్-3లో తొలి 11 వారాల పాటు రాహుల్, పునర్నవిల మధ్య కొనసాగిన రిలేషన్‌ షిప్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. వారి మధ్య అలకలు, ప్రేమ చూసేవారిని మెప్పించింది. పునర్నవి స్వయంగా రాహుల్ కు గోరుముద్దలు తినిపించడం, ఏదైనా తప్పు చేస్తే తిట్టేయడం, పునర్నవి కోసం రాహుల్ కాకరకాయ జ్యూస్ ను తాగేయడం వంటివి హైలైట్ గా నిలిచాయి.

తనకోసం కష్టపడిన రాహుల్ ను హౌస్ లోనే గట్టిగా హత్తుకున్న పునర్నవి ముద్దులు కూడా ఇచ్చింది. పునర్నవి ఎలిమినేట్ అయితే, రాహుల్ వెక్కివెక్కి ఏడవడంతో ఇద్దరి మధ్యా ఏదో ఉందని అభిమానులు అంచనాకు వచ్చేశారు. తామిద్దరమూ బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమేనని వారంటున్నా, ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్త చక్కర్లు కొడుతోంది.

ఇక తాజాగా రాహుల్ తల్లిదండ్రుల మాటలు వింటుంటే ప్రేక్షకుల్లో అనుమానాలు పెరుగుతున్నాయి. రాహుల్ కు పెళ్లి చేయాలని భావిస్తున్న వారు, పునర్నవి, రాహుల్ ఇష్టపడితే, పెళ్లి చేస్తామని చెప్పారు. విషయమేంటని రాహుల్ ను కనుక్కుంటామని, ఆపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇక వారిద్దరి మధ్యా ఉన్నది స్నేహమా? ప్రేమా? తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగక తప్పదు.
Go Back to Shorts
Rahul
Punarnavi
Biggboss
Season-3
Marriage

More Telugu News