బిగ్ బాస్-3 విజేత రాహుల్ సిప్లిగంజ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బిగ్ బాస్-3 విజేత రాహుల్ సిప్లిగంజ్

  • ముగిసిన బిగ్ బాస్ మూడో సీజన్
  • మూడు నెలల పాటు అలరించిన రియాల్టీ షో
  • రన్నరప్ గా శ్రీముఖి
మూడు నెలల పాటు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను ఉర్రూతలూగించిన బిగ్ బాస్ మూడో సీజన్ టైటిల్ ను గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ గెలుచుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి సమక్షంలో రాహుల్ విజేతగా నిలిచినట్టు హోస్ట్ నాగార్జున ప్రకటించారు. శ్రీముఖి రన్నరప్ గా నిలిచింది. ఫైనలిస్టులు శ్రీముఖి, రాహుల్ మధ్యలో నాగార్జున ఇద్దరి చేతులు పట్టుకోగానే, అందరిలోనూ ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. చివరికి నాగ్ సింగర్ రాహుల్ చేతిని పైకెత్తడంతో హర్షధ్వనాలు మిన్నంటాయి.

ఇక మైక్ చేతికి అందగానే విజేత రాహుల్ భావోద్వేగాలు ఆపుకోలేక హెచ్చుస్థాయిలో మాట్లాడాడు. తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కృతజ్ఞతలు అంటూ గట్టిగా అరిచేశాడు. ఇక, పునర్నవి గురించి మాట్లాడుతూ, టాస్క్ లో బాగా పెర్ఫామ్ చేయాలంటూ ఎంతో ప్రోత్సహించిందని, తల్లిదండ్రుల ఆశీర్వాదాలు కూడా తన విజయానికి దోహదపడ్డాయని తెలిపాడు. ఇక చిరంజీవి చేతుల మీదుగా రాహుల్ క్యాష్ చెక్ బోర్డు అందుకున్నాడు.
Bigg Boss
Rahul Sipligunj
Srimukhi

More Telugu News