Somireddy: సీబీఐ కోర్టు గట్టి సందేశాన్ని ఇచ్చింది: జగన్ పిటిషన్ కొట్టివేతపై సోమిరెడ్డి స్పందన

షార్ట్స్‌లో చూడండి
అక్రమాస్తుల కేసులో కోర్టు విచారణకు హాజరవడంపై మినహాయింపును ఇవ్వాలంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పెట్టుకున్న పిటిషన్ ను హైదరాబాద్, నాంపల్లిలోని సీబీఐ కోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు.

'ఆర్థిక నేరాలు, పెద్ద కేసుల్లో ముద్దాయి ఎంత పెద్దవాడయినా.. చట్టం ముందు సమానమేనని సీబీఐ కోర్టు గట్టి సందేశాన్ని ఇచ్చింది. ప్రజలందరూ కోరుకున్న తీర్పునిచ్చింది. ఇక ఈ రోజుల్లో రాజీనామా అంటారా?..అది జగన్ విజ్ఞతకే వదిలేస్తున్నాం' అంటూ ట్వీట్ చేశారు. భారత రాష్ట్రపతి అయినా, ముఖ్యమంత్రులైనా, పంచాయతి బోర్డు అధ్యక్షుడైనా, సామాన్యుడైనా చట్టానికి ఎవరూ అతీతులు కాదన్న సందేశం వచ్చిందని అన్నారు.
Go Back to Shorts
Somireddy
YSRCP
Jagan

More Telugu News