కోడిపందాలపై పోలీసుల దాడి... పారిపోతూ ఇద్దరి మృతి!

దసరా, దీపావళి ముగిసింది. ఇక రానున్నది సంక్రాంతి సీజన్... అంటే ముందు గుర్తుకు వచ్చేది కోడి పందాలే. కోడి పందాల కోసం ఇప్పటి నుంచే ఏర్పాట్లు జరుగుతున్నాయి. సంక్రాంతి కోసం ఇప్పటికే పలు జిల్లాల్లో వేలాది కోళ్లు పెరుగుతున్నాయి. ఇక కోడి పందాలను ఎలాగైనా అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్న పోలీసులు, తాజాగా జరిపిన దాడులు ఇద్దరి ప్రాణాలను బలిగొన్నాయి.

ఈ ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. చీరాల మండలం విజయనగర్ కాలనీ శివార్లలో కోడి పందాల స్థావరాలున్నాయని తెలుసుకున్న పోలీసులు దాడులు చేశారు. పోలీసులను చూసిన నిర్వాహకుల్లో ముగ్గురు పారిపోయే క్రమంలో సమీపంలోని కాలువలో పడి గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరి మృతదేహాలను బయటకు తీశారు. వారిని మధు, శ్రీనుగా గుర్తించారు. గల్లంతైన మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు.
Go Back to Shorts
Cock Fight
Prakasam District
Police
Died

More Telugu News