కెరీర్ లో పదోసారి... స్విస్ చాంపియన్ షిప్ గెలిచిన రోజర్ ఫెదరర్!
- 6-2, 6-2 తేడాతో విజయం
- అలెక్స్ డి మినార్ పై ఫెదరర్ గెలుపు
- కెరీర్ లో 103 సింగిల్స్ టైటిల్ సాధించిన స్విస్ స్టార్
ఈ సీజన్ లో ఇది ఫెదరర్ కు నాలుగో టైటిల్, దుబాయ్, మియామి, హాలే టైటిల్స్ ను ఇప్పటికే గెలుచుకున్న ఫెడ్, ఇప్పుడు స్విస్ పోటీల్లోనూ గెలిచాడు. ఆట ముగిసిన తరువాత మీడియాతో మాట్లాడిన ఫెదరర్, ఆట తొందరగా పూర్తయినా, తాను ఉత్తమమైన ఆటతీరును కనబరిచాననే అనుకుంటున్నట్టు తెలిపాడు. అలెక్స్ ఈ టోర్నీ ఆసాంతం అద్భుతంగా ఆడాడని, హోమ్ టౌన్ లో టైటిల్ గెలుచుకోవడం తనకెంతో ప్రత్యేకమైన విజయమని చెప్పుకొచ్చాడు.