Mumbai: మా ఇంటి ఎదురుగా ఉన్న ముస్లిం ఫ్యామిలీ నా దీపావళికి అడ్డుపడింది: టీవీ నటుడు విశ్వభాను ఫిర్యాదు

షార్ట్స్‌లో చూడండి
తన ఎదురింట్లో ఉన్న ఓ ముస్లిం కుటుంబం తనను దీపావళి వేడుకలు చేసుకోనీయకుండా అడ్డు పడిందని, తన ఇంటిముందున్న దీపావళి తోరణాలను తెంపేశారని పలు సీరియళ్లు, సినిమాలలో నటించిన హిందీ నటుడు విశ్వభాను, ప్రధాని నరేంద్ర మోదీకి ట్యాగ్ చేస్తూ, సోషల్ మీడియాలో వీడియోను పెట్టడం కలకలం రేపుతోంది. ఈ విషయంలో విశ్వభాను ముంబై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.

ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం, ముంబైలోని మాల్వానీ సొసైటీలో ఆయన ఉంటున్నారు. అది ముస్లిం సొసైటీ. గత సంవత్సరం ఆయన దీపావళి వేడుకలు చేసుకునేందుకు వీలు లేదని అక్కడి వారు అడ్డుకున్నారు. అదే విధంగా ఈ ఏడాది కూడా అడ్డుకున్నారు. తన ఇంటి తలుపులను మూసివేసి బయటకు రానీయకుండా చేశారని ఆరోపించారు. విశ్వభాను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాఫ్తు చేస్తున్నట్టు తెలిపారు.
Go Back to Shorts
Mumbai
Dewali
Vishwajith
Celebrations

More Telugu News