బాగ్దాదీ మృతితో కథ ముగిసినట్లు కాదు: అమెరికా
- దేశ చరిత్రలో ఇది ఒక గొప్ప రోజు
- ఐసిస్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది
- ఆ ఉగ్ర సంస్థ మూలాలను తుడిచిపెట్టాల్సి ఉంది
ఈ ఆపరేషన్ లో పాల్గొన్న సైన్యంపై ప్రశంసలు కురిపించారు. ప్రపంచాన్ని బెదిరించడానికి యత్నించిన ఉగ్రవాద నేత తన చివరి క్షణాల్ని భయంతో గడిపాడని అమెరికా రక్షణశాఖ సలహాదారు రాబర్ట్ ఓబ్రియెన్ తెలిపారు. బలగాలు అతనిపై దాడి చేస్తోంటే వణికిపోయాడని చెప్పారు. తమ దేశానికి ఐసిస్ ముప్పులా పరిణమించిందని తెలిపారు. కాగా, ఐసిస్ చీఫ్ అబూబకర్ అల్ బాగ్దాదీ మృతిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ధారించిన విషయం తెలిసిందే. సైనిక దాడుల సమయంలో అతడు ఆత్మాహుతికి పాల్పడ్డాడని ఆయన వెల్లడించారు.