ఓటర్లు ప్రమాదకర తీర్పునిచ్చారు.. బీహార్లో ఎఐఎంఐఎం గెలుపుపై కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్
- ఓటర్ల తీర్పు రాష్ట్ర సామజిక సమగ్రతకు భంగకరం
- ఎఐఎంఐఎం జిన్నాభావజాలంను కలిగివుంది
- వారు సామజిక సమగ్రతకు ముప్పు తెచ్చే ప్రమాదం
‘బీహార్ ఉప ఎన్నికలో అతి ప్రమాదకరమైన తీర్పు వెలువడింది. కిషన్ గంజ్ నియోజకవర్గంలో అసదుద్దీన్ ఒవైసీ పార్టీ ఎఐఎంఐఎం విజయం సాధించింది. అది జిన్నా భావజాలంను కలిగి వుంది. వారు వందే మాతరంను అసహ్యించుకుంటారు. రాష్ట్రంలో సామాజిక సమగ్రతకు వారు ముప్పుగా పరిణమించే అవకాశముంది’ అని అన్నారు. బీహార్ ప్రజలు తమ భవిష్యత్తుపై ఆలోచన చేయాలని సింగ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.