ఫేస్ బుక్ నుంచి కొత్త అప్ డేట్... ప్రస్తుతానికి అమెరికాలోనే...!
- ఫేస్ బుక్ లో న్యూస్ విభాగం
- మీడియా సంస్థల కథనాలకు చోటు
- అమెరికాలో పైలెట్ ప్రాజెక్టు
స్థానిక మీడియా సంస్థల కథనాలు, పాత్రికేయులు ఎంపిక చేసిన కథనాలకు ఫేస్ బుక్ న్యూస్ విభాగంలో చోటు కల్పిస్తారు. ప్రత్యేకమైన ఆల్గోరిథమ్ ద్వారా యూజర్ల అభిరుచులకు అనుగుణంగా వార్తలు కనిపించేలా ఈ న్యూస్ విభాగాన్ని తీర్చిదిద్దుతున్నారు. అంతేకాదు, పెయిడ్ న్యూస్ సబ్ స్క్రిప్షన్లను ప్రచారం చేసుకునే వారికి అనువుగా ఇందులోనే ప్రత్యేక విభాగం ఉంటుంది.