Andhra Pradesh: ఏపీలో వారసత్వ రాజకీయాలకు పుల్ స్టాప్ పెట్టాలి: పవన్ కల్యాణ్
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడ్డారు. వైసీపీ నేతల కనుసన్నల్లోనే బ్రాందీ షాపులు నడుస్తున్నాయని ఆరోపించారు. టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ కు పట్టిన గతే వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి పడుతుందని పవన్ పేర్కొన్నారు. సీఎం జగన్ తో తనకు వ్యక్తిగత గొడవలు లేవన్నారు. రాష్ట్రంలో వారసత్వ రాజకీయాలకు పుల్ స్టాప్ పెట్టాలని అన్నారు.