మోదీ తన స్నేహితుల కోసం ‘కాంకర్‌’ను అమ్మకానికి పెడుతున్నారు: రాహుల్‌ విమర్శ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మోదీ తన స్నేహితుల కోసం ‘కాంకర్‌’ను అమ్మకానికి పెడుతున్నారు: రాహుల్‌ విమర్శ

  • కాంకర్‌ ఉద్యోగులను కలిసి మాట్లాడిన కాంగ్రెస్‌ నేత
  • లాభాల్లో ఉన్న సంస్థను అమ్మజూపడం దారుణం
  • ఉద్యోగుల పిటిషన్ ట్విట్టర్‌లో పోస్టింగ్‌
కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ ప్రధాని నరేంద్రమోదీపై విమర్శలు కురిపించారు. మోదీ తన స్నేహితుల కోసం అత్యంత లాభాల్లో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ ‘కంటైనర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (కాంకర్‌)’ను ప్రైవేటు పరం చేయాలని యోచిస్తున్నారని ధ్వజమెత్తారు. కాంకర్‌ యూనియన్‌ సభ్యులను కలిసిన రాహుల్‌ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం యూనియన్‌ సభ్యులు ఇచ్చిన పిటిషన్‌ను రాహుల్‌ తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

‘ప్రభుత్వ రంగ సంస్థలలో కంటైనర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఓ ఆభరణం లాంటిది. అత్యంత లాభాలతో నడుస్తున్న సంస్థ. అటువంటి సంస్థను ప్రభుత్వం ప్రైవేటు పరం చేయాలని చూస్తోంది. దీంతో ఈ సంస్థను సొంతం చేసుకోవాలని మోదీ ఆశ్రిత పెట్టుబడిదారి స్నేహితులు కొందరు కాచుకు కూర్చుని ఉన్నారు’ అంటూ ట్విటర్‌లో పోస్టు చేశారు. అయితే కాంకర్‌ ఉద్యోగులు, కార్మికులకు కాంగ్రెస్‌ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
conchor
Rahul Gandhi
Narendra Modi
praivate

More Telugu News