ప్రభుత్వానికి చేరిన హైకోర్టు ఆర్డర్ కాపీ.. నివేదిక తయారు చేయాలంటూ కేసీఆర్ ఆదేశం
- ప్రభుత్వానికి అందిన ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆర్డర్ కాపీ
- సాధ్యాసాధ్యాలపై నివేదిక తయారు చేయాలని సీఎం ఆదేశం
- పువ్వాడ, ముఖ్య అధికారులతో రాజీవ్ శర్మ సమీక్ష
సీఎం ఆదేశాల నేపథ్యంలో, రవాణా మంత్రి పువ్వాడ అజయ్, ఇతర ముఖ్య అధికారులతో ప్రగతి భవన్ లో రాజీవ్ శర్మ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సాయంత్రం 3 గంటలకు కోర్టు తీర్పు, ఇతర అంశాలపై కేసీఆర్ చర్చించనున్నారు. అనంతరం ఆర్టీసీకి దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.