విరాళమిచ్చిన భక్తునికి వీఐపీ బ్రేక్ దర్శనం... నాలుగు టికెట్లు కొన్న చెన్నై భక్తుడు!
- విరాళమిచ్చే వారికి ప్రొటోకాల్ దర్శనం
- రూ. 40 వేలు చెల్లించి నాలుగు టికెట్లు కొన్న భక్తుడు
- స్వయంగా టికెట్లు ఇచ్చిన ఏఈఓ ధర్మారెడ్డి
శ్రీవాణి ట్రస్ట్ కు రూ. 10 వేలు అంతకుమించి ఇచ్చే దాతలకు ప్రత్యేక ప్రివిలేజ్ కింద బ్రేక్ దర్శన టికెట్ ఇవ్వాలని గతంలోనే నిర్ణయించిన టీటీడీ, సోమవారం నాడు ఈ పథకాన్ని ప్రారంభించింది. భక్తుల కోసం గోకులం విశ్రాంతి భవనంలో సింగిల్ విండో కౌంటర్ ను కూడా ఏర్పాటు చేశారు.