హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం...12 మందిని కాపాడిన అగ్నిమాపక సిబ్బంది
- మధ్యప్రదేశ్ లోని ఇండోర్‌లో ఘటన
- మొదటి అంతస్తులో మంటలు ప్రారంభమై విస్తరణ
- హోటల్‌ని ఆనుకుని ఇళ్లుండడంతో ఆందోళన
ముందు జాగ్రత్త చర్యగా హోటల్‌ని ఆనుకుని వున్న ఇళ్లలోని వారిని ఖాళీ చేయించారు. ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిపివేయించారు. భారీ ప్రమాదమే అయినప్పటికీ ఆ సమయానికి హోటల్‌లో ఎక్కువ మంది అతిథులు లేకపోవడంతో భారీ ప్రాణ నష్టం తప్పిందని భావిస్తున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదని, భారీ ఆస్తి నష్టం జరిగిందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.