Somireddy: కియా ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రే రాకపోతే రాష్ట్రంలో పెట్టుబడులకు ఎవరు ముందుకొస్తారు?: సోమిరెడ్డి

షార్ట్స్‌లో చూడండి
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గుంటూరులో జరిగిన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో పాల్గొన్నారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ, సీఎం జగన్ పైనా, రాష్ట్ర ప్రభుత్వంపైనా విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో పాలన మొత్తం నిలిచిపోయిందని, వైసీపీ సర్కారు వైఖరితో రాష్ట్రానికి పరిశ్రమలు రావడంలేదని ఆరోపించారు.

కియా వంటి పెద్ద సంస్థ తన యూనిట్ ను రాష్ట్రంలో ఏర్పాటు చేస్తే ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి రాలేదని, ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరు ముందుకొస్తారని సోమిరెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో గ్రామ స్థాయి పనుల నుంచి పోలవరం వంటి పెద్ద ప్రాజెక్టు పనుల వరకు ప్రతిదీ ఆగిపోయిందని వివరించారు. గత కొన్ని నెలలుగా రాష్ట్ర ఆదాయం గణనీయంగా పడిపోయిందని, రాష్ట్రంపై పెట్టుబడిదారుల విశ్వసనీయత తగ్గిపోయిందని అన్నారు.
Go Back to Shorts
Somireddy
Jagan
Andhra Pradesh
Telugudesam
YSRCP

More Telugu News