వెంకటేశ్ గారితో సినిమా చేయాలనుంది: దర్శకుడు ఓంకార్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వెంకటేశ్ గారితో సినిమా చేయాలనుంది: దర్శకుడు ఓంకార్

  • ఈ కథకి స్టార్స్ అవసరం లేదు 
  • కావాల్సినంత కామెడీని జోడించాము 
  • అశ్విన్ కి హీరోగా మంచి పేరు వస్తుందన్న ఓంకార్
ఓంకార్ దర్శకత్వం వహించిన 'రాజుగారి గది 3' చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఓంకార్ మాట్లాడుతూ .." ఈ సినిమాలో స్టార్స్ లేరని అంతా అంటున్నారు. కథా పరంగా ఈ సినిమాకి స్టార్స్ అవసరం లేదు .. అందువలన తీసుకోలేదు. స్క్రిప్ట్ ప్రధానంగా ఈ కథ నడుస్తుంది .. అందువలన స్టార్స్ లేని లోటు ఎంతమాత్రం తెలియదు.

కావాల్సినంత కామెడీని జోడించి ఈ హారర్ థ్రిల్లర్ ను అందిస్తున్నాము. ఈ సినిమా తరువాత అశ్విన్ కి హీరోగా మంచి గుర్తింపు వస్తుందని భావిస్తున్నాను. 'రాజుగారి గది 2' తరువాత వెంకటేశ్ గారితో ఒక సినిమా చేయాలనుకున్నాను. కానీ పరిస్థితులు అనుకూలించలేదు. అందువలన 'రాజుగారి గది 3' కోసం రంగంలోకి దిగాల్సి వచ్చింది. వెంకటేశ్ గారితో ఒక సినిమా చేయాలనేది నా డ్రీమ్. త్వరలో తప్పకుండా ఆయనతో ఒక సినిమా చేస్తాననే నమ్మకం వుంది" అని చెప్పుకొచ్చాడు.
Ohmkar
Ashwin
Avika

More Telugu News