ధోనీ భవిష్యత్తుపై బీసీసీఐ కాబోయే అధ్యక్షుడు గంగూలీ స్పందన
- ఈ నెల 23న బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించనున్న గంగూలీ
- ధోనీ గురించి సెలక్టర్ల అభిప్రాయం తెలుసుకుంటానన్న దాదా
- ధోనీతో కూడా మాట్లాడతానంటూ వ్యాఖ్య
ఈ నేపథ్యంలో, ధోనీ భవితవ్యం గురించి మీడియా సమావేశంలో గంగూలీ మాట్లాడారు. ఈ నెల 24న సెలక్టర్లతో తాను భేటీ కానున్నానని చెప్పారు. ధోనీ గురించి ఆ సమావేశంలో సెలక్టర్ల అభిప్రాయాన్ని తెలుసుకుంటానని... ఆ తర్వాత ధోనీతో కూడా మాట్లాడతానని తెలిపారు. ఈ సమావేశంలో కెప్టెన్ కోహ్లీ కూడా పాల్గొనే అవకాశం ఉంది. మరోవైపు, మారిన నిబంధనల కారణంగా ఈ సమావేశానికి కోచ్ రవిశాస్త్రి అందుబాటులో ఉండకపోవచ్చని గంగూలీ తెలిపారు.