ఆర్బీఐను లూటీ చేసి డెకాయిట్లకు పెడుతున్నారు: బీజేపీ ప్రభుత్వంపై సీపీఐ నేత నారాయణ ఫైర్
- దేశంలో రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి
- ఇలా చేస్తే రైతులకు ఆ ఆరువేల రూపాయలు ఎందుకు?
- పేదలకు అన్యాయం చేస్తున్నారు
ఆర్బీఐను లూటీ చేయించి కార్పొరేట్ కంపెనీలకు, డెకాయిట్లకు పెడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇన్వెస్ట్ మెంట్లు మొత్తం బకాసురులకు పెట్టి పేదలకు అన్యాయం చేస్తున్నారని, ఈ విషయమై ప్రశ్నిస్తే మతాన్ని అడ్డుపెట్టుకుంటున్నారని బీజేపీ నేతలపై ధ్వజమెత్తారు. ఎన్నికలప్పుడు ప్రతిసారి ఒక సెంటిమెంట్ సృష్టించి పబ్బం గడుపుకుంటారా? ఓట్లు సంపాదించుకుంటారా? చివరకు మూడు నామాలు పెడతారా? అంటూ బీజేపీపై విరుచుకుపడ్డారు.