Prostitute: డబ్బు ఎక్కువ అడిగిన వ్యభిచారిణి.. కత్తితో 30 పోట్లు పొడిచి చంపేసిన విటుడు!

షార్ట్స్‌లో చూడండి
డబ్బు ఎక్కువగా డిమాండ్ చేసిందన్న కోపంతో ఓ వ్యభిచారిణిని ఆమె వద్దకు వచ్చిన విటుడు కత్తితో పొడిచి చంపేశాడు. ఈ ఘటన ముంబైలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, ముంబైలో కేటరింగ్ పనులు చేసే ఓ యువకుడు ఈనెల 13న స్థానికంగా ఉన్న కామాటిపురాలోని ఓ వ్యభిచార గృహానికి వచ్చాడు. అక్కడున్న వ్యభిచారిణుల్లో ఒకామెను సెలెక్ట్ చేసుకున్నాడు. అనంతరం ఆమె ఎక్కువ డబ్బులు డిమాండ్ చేయడంతో... కోపంతో 30 కత్తిపోట్లు పొడిచాడు. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అనంతరం అతను అక్కడి నుంచి పారిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు, సదరు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు అతన్ని కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.
Go Back to Shorts
Prostitute
Murder
Kamatipura
Mumbai

More Telugu News