అమెరికా వెళుతోన్న మెగా హీరో
- మారుతి నుంచి 'ప్రతిరోజూ పండగే'
- హైదరాబాదులో జరుగుతోన్న షూటింగ్
- తదుపరి షెడ్యూల్ అమెరికాలో
కథాపరంగా కొంత చిత్రీకరణ విదేశాల్లోను వుంటుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఆ తరువాత షెడ్యూల్ ను అమెరికాలో ప్లాన్ చేశారు. ప్రధాన పాత్రల కాంబినేషన్లోని కొన్ని సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారు. సాయిధరమ్ తేజ్ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్న ఈ సినిమాలో, ఆయన సరసన రాశిఖన్నా నటిస్తుండగా, ముఖ్యమైన పాత్రల్లో సత్యరాజ్ .. రావు రమేశ్ కనిపించనున్నారు.