Kadapa District: వివేకా హత్య కేసులో వదంతులు నమ్మొద్దు: ఎస్పీ
కడప జిల్లా నూతన ఎస్పీగా కొన్నిరోజుల క్రితమే బాధ్యతలు అందుకున్న అన్బురాజన్ వైసీపీ మాజీ ఎంపీ వైఎస్ వివేకా హత్యకేసుపై స్పందించారు. వివేకా హత్య కేసులో వదంతులు నమ్మొద్దని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో అసత్య ప్రచారాలు చేసేవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వివేకా హత్య కేసులో సునీల్ గ్యాంగ్ ప్రమేయంపై వార్తలు అవాస్తవం అని అన్నారు.