Telangana: తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లాలనుకునే వారికి మోదీ సర్కారు శుభవార్త!

షార్ట్స్‌లో చూడండి
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లి స్థిరపడాలని భావించినా, వెళ్లలేకపోయిన వారికి కేంద్ర సర్కారు శుభవార్తను చెప్పింది. ఏపీలో స్థానికత గడువును మరో రెండేళ్లు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లేవారికి స్థానికత కల్పించేందుకు ఇప్పటివరకూ ఉన్న ఐదేళ్ల గడువును ఏడేళ్లకు పెంచుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర హోమ్ శాఖ ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను గెజిట్ లో ప్రచురించింది. ఇటీవల జగన్ న్యూఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీని కలిసినప్పుడు గడువును పొడిగించాల్సిందిగా విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది. జగన్ కోరిక మేరకు మోదీ స్వయంగా హోమ్ శాఖకు స్థానికత గడువును పెంచాలని సూచించినట్టు సమాచారం.
Go Back to Shorts
Telangana
Andhra Pradesh
Narendra Modi
Local
Jagan

More Telugu News