ఆహూతుల ఎంగిలి ప్లేట్లను ఎత్తిన జస్టిస్ చల్లా కోదండరామ్!
- సీనియర్ న్యాయమూర్తి సంజయ్ కుమార్ కు వీడ్కోలు కార్యక్రమం
- అల్పాహారం తినేసి ప్లేట్లు వదిలెళ్లిపోయిన ఆహూతులు
- స్వయంగా వాటిని తొలగించేందుకు పూనుకున్న చల్లా కోదండరామ్
ఆపై అందరూ తమ తమ ప్లేట్లను ఎక్కడ పడితే అక్కడ పడేసి వెళ్లిపోయారు. దీన్ని గమనించిన జస్టిస్ చల్లా కోదండరామ్, బాధ్యతగల న్యాయవాదులు ఇలా చేయడాన్ని చూసి భరించలేక, వెంటనే ఆ ప్రాంతమంతా కలియ తిరుగుతూ, న్యాయవాదులు తిని పారేసిన ప్లేట్లను తీయడం ప్రారంభించారు. తొలుత ఈ దృశ్యాన్ని చూసిన న్యాయవాదులకు ఆయన ఏం చేస్తున్నారో అర్థం కాలేదు. ఆ తరువాత ఎంగిలి ప్లేట్లు తీస్తున్నారని తెలుసుకుని, ఆయనతో పాటు పలువురు న్యాయవాదులు ప్లేట్లను తీయడం మొదలు పెట్టారు.