Nannaya: లైంగిక వేధింపులపై ముఖ్యమంత్రికి నన్నయ వర్శిటీ విద్యార్థినుల లేఖ.. విచారణకు ఆదేశించిన జగన్

షార్ట్స్‌లో చూడండి
తమను ఓ ప్రొఫెసర్ లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడంటూ నన్నయ యూనివర్శిటీ విద్యార్థినులు రాసిన లేఖతో ఏపీ సీఎం జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రాజమండ్రిలోని నన్నయ విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్ డిపార్ట్ మెంట్ హెడ్ ప్రొఫెసర్ సూర్యరాఘవేంద్ర స్పెషల్ క్లాసుల పేరిట ఎంఏ ఇంగ్లీష్ విద్యార్థినులను తన నివాసానికి రప్పించుకుంటున్నాడని, క్లాసుల కోసం ఆయన ఇంటికి వెళ్లిన విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపణలు వచ్చాయి. తమకు ఎదురవుతున్న దారుణాల పట్ల విద్యార్థినులు చివరికి ఏపీ సీఎంకు లేఖ రాశారు.
Go Back to Shorts
Nannaya
Jagan
Andhra Pradesh

More Telugu News