తిరుమలలో గణనీయంగా పెరిగిన రద్దీ!

  • నిన్న కాస్తంత ఖాళీగా కనిపించిన తిరుమల
  • వారాంతం కలిసిరావడంతో భారీగా వచ్చిన భక్తులు
  • సర్వ దర్శనానికి 24 గంటల సమయం
గురువారం నాడు కాస్తంత ఖాళీగా కనిపించిన తిరుమల వీధులు, నేడు మళ్లీ కిక్కిరిసిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో దసరా సెలవులు కొనసాగుతుండటంతో పాటు, వారాంతం కలిసిరావడంతో భారీ ఎత్తున భక్తులు కొండపైకి వచ్చారు. వీరంతా స్వామి దర్శనానికి వేచి చూస్తూ ఉండటంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్టుమెంట్లూ నిండి, క్యూలైన్ వెలుపలికి వచ్చింది. స్వామి సర్వ దర్శనానికి 24 గంటల సమయం పడుతోందని, క్యూలైన్లలో వేచివున్న వారికి అన్న పానీయాలు సమకూరుస్తున్నామని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న దాదాపు 80 వేల మందికి పైగా భక్తులు స్వామిని దర్శించుకున్నారు.
Go Back to Shorts
tirumala
TTD
Piligrims

More Telugu News