ఆర్టీసీ భూములను కేసీఆర్ తన బంధువులకు ధారాదత్తం చేస్తున్నారు: రఘునందన్
- ఆర్టీసీని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు
- ఆర్టీసీ ఆస్తులను అమ్ముకునేందుకు యత్నిస్తున్నారు
- టీఆర్ఎస్ పాలనకు రోజులు దగ్గర పడ్డాయి
కేసీఆర్ నిరంకుశ పాలనకు ముగింపు పలికేందుకు అన్ని కార్మిక, ప్రజా సంఘాలు రంగంలోకి దిగాయని రఘునందన్ అన్నారు. టీఆర్ఎస్ పాలనకు రోజులు దగ్గర పడ్డాయని చెప్పారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని... కార్మికులపై కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.