చింతమనేనికి ఓ న్యాయం.. కోటంరెడ్డికి మరో న్యాయమా జగన్ గారూ?: వర్ల రామయ్య
- ఎంపీడీవో సరళపై దౌర్జన్యం చేసిన కోటంరెడ్డిని అరెస్ట్ చేయాలి
- రాష్ట్ర అధికారులు, ఎంపీడీవో సంఘాలు ఏం చేస్తున్నాయి?
- కోటంరెడ్డి దౌర్జన్యాలు మీ దృష్టికి ఎందుకు రావడం లేదు జగన్ గారూ?
ముఖ్యమంత్రిగారూ శ్రీధర్ రెడ్డి దౌర్జన్యాలు తమరి దృష్టికి ఎందుకు రావడం లేదని వర్ల రామయ్య ప్రశ్నించారు. మీ సమాచార వ్యవస్థ అంత బలహీనంగా ఉందా? అని అడిగారు. టీడీపీ నేత చింతమనేనికి ఒక న్యాయం... మీకు అస్మదీయుడైన శ్రీధర్ రెడ్డికి మరో న్యాయమా? అని ప్రశ్నించారు.