మహిళా ఎంపీడీవో ఇంటిపై దాడి చేసిన వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డిపై కేసు నమోదు

  • నెల్లూరు జిల్లా వెంకటాచలం ఎంపీడీవో ఇంటిపై కోటంరెడ్డి దాడి
  • దాడికి పాల్పడ్డారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన సరళ
  • శ్రీధర్ రెడ్డి, అతని అనుచరుడు శ్రీకాంత్ రెడ్డిపై కేసు నమోదు
నెల్లూరు జిల్లా వెంకటాచలం ఎంపీడీవో సరళ ఇంటిపై దాడికి పాల్పడ్డ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అతని అనుచరుడు శ్రీకాంత్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కల్లూరిపల్లిలో ఉన్న సరళ ఇంటి వద్దకు వెళ్లిన కోటంరెడ్డి... నీటి పైపు లైను ధ్వంసం చేశారు. విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. కేబుల్ వైర్ ను కట్ చేశారు. ఈ నేపథ్యంలో, తన ఇంటిపై దాడి చేసి, తనపై దౌర్జన్యానికి పాల్పడ్డారంటూ శ్రీధర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డిలపై సరళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Go Back to Shorts
Kotamreddy
Nellore District
MPDO
Sarala
Case
YSRCP

More Telugu News