YSRCP: శకుని మామా! సోషల్ మీడియాని భ్రష్టు పట్టించిన ఘన చరిత్ర మీది: విజయసాయిరెడ్డికి బుద్ధా కౌంటర్

షార్ట్స్‌లో చూడండి

‘మీ బానిస పత్రికలు, చానళ్లు ఎంత దాచిపెట్టినా మీ అరాచకాలన్నింటినీ సోషల్ మీడియా బయటపెట్టిందనేనా ఈ ఏడుపు!.. సిగ్గులేని బతుకులు ఎవరివో ఐదుగురి పేర్లు చెప్పమంటే ఆ తండ్రీకొడుకుల పేర్లే ఫస్టుంటాయి. ఆ లిస్టులో కిరసనాయిలు తప్పనిసరిగా ఉంటాడు. వీళ్లు జన్మలో మారరు’ అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన విమర్శలపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఘాటుగా స్పందించారు. ట్విట్టర్ వేదికగా ‘శకుని మామా’ అంటూ విజయసాయిరెడ్డిని, ‘మీ తుగ్లక్’ అంటూ వైఎస్ జగన్ పైనా విరుచుకుపడ్డారు.

‘సోషల్ మీడియాని భ్రష్టు పట్టించిన ఘన చరిత్ర మీది శకుని మామా! పేటీఎంలో డబ్బులు వేసి పోస్టులు పెట్టించుకొని లైకులు కొట్టించుకునే దౌర్భాగ్యం నీది, మీ తుగ్లక్  వైఎస్ జగన్ ది. మీ వైఎస్సార్సీపీ అబద్ధపు బతుకులు టీడీపీ సోషల్ మీడియా వాలంటీర్ల ద్వారా బయటపడుతున్నాయని వణుకు వస్తోందా?’ అబద్ధాలు, కుట్రపూరిత వార్తలు తప్ప ఒక్క నిజాన్ని కూడా నీ పేపర్లో  ప్రచురించని నీకు అసలు వేరే పత్రికలు గురించి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడ ఉంది శకుని మామా ? అక్కడికేదో దేశంలో ఉన్న పత్రికలన్నింటికీ నువ్వే సలహాదారు అయినట్లు చెప్తున్నావ్ !’ అని విమర్శించారు.
Go Back to Shorts
YSRCP
vijayasaireddy
mp
Telugudesam
Budha

More Telugu News