రజనీకాంత్ కోసం కథ రెడీ చేస్తోన్న గౌతమ్ మీనన్
- 'దర్బార్' షూటింగులో బిజీగా రజనీ
- 'లండన్' లో జరుగుతోన్న షూటింగ్
- తదుపరి సినిమా గౌతమ్ మీనన్ తో
'పేట' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రజనీకాంత్, ఆ తరువాత మురుగదాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. 'దర్బార్' టైటిల్ తో రూపొందుతోన్న ఈ సినిమాలో ఆయన సరసన నాయికగా నయనతార నటిస్తోంది. సంక్రాంతికి ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.
ఈ నేపథ్యంలో ఆయన తన తదుపరి సినిమాను గౌతమ్ మీనన్ దర్శకత్వంలో చేయనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. గౌతమ్ మీనన్ తో సినిమా చేయాలనుందనే ఆసక్తిని ఒకానొక సమయంలో రజనీ వ్యక్తం చేశారు. రజనీతో సినిమాచేసే పట్టుదలతో గౌతమ్ మీనన్ వున్నారు. తాజాగా ఆయన రజనీ కోసం ఒక పవర్ఫుల్ సబ్జెక్ట్ ను తయారు చేశారట. 'దర్బార్' షూటింగ్ నిమిత్తం ప్రస్తుతం రజనీ 'లండన్'లో వున్నారు. అక్కడి నుంచి ఆయన తిరిగిరాగానే కథ వినిపించడానికి గౌతమ్ మీనన్ సిద్ధంగా వున్నట్టుగా చెప్పుకుంటున్నారు.