తిరుమల బ్రహ్మోత్సవాలకు సీఎం కేసీఆర్ కు ఆహ్వానం

  • బ్రహ్మోత్సవాలకు రావాలని ఆహ్వానించిన సీఎం జగన్ 
  • కేసీఆర్ కు ఆహ్వానపత్రిక అందజేత
  • ప్రగతిభవన్ లో కొనసాగుతున్న ఇరురాష్ట్రాల సీఎంల భేటీ 
తిరుమల బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని సీఎం కేసీఆర్ కు ఆహ్వానం అందింది. కేసీఆర్ కు బ్రహ్మోత్సవాల ఆహ్వానపత్రాన్ని ఏపీ సీఎం జగన్ అందజేశారు. కేసీఆర్ తన కుటుంబంతో పాటు బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాల్సిందిగా కోరారు. కాగా, హైదరాబాద్ లోని ప్రగతిభవన్ లో కేసీఆర్, జగన్ ల భేటీ కొనసాగుతోంది.  గోదావరి జలాలు, విభజన అంశాలపై ప్రధానంగా చర్చించినట్టు సమాచారం. రాజకీయ అంశాల ప్రస్తావన కూడా వారి మధ్య వచ్చినట్టు తెలుస్తోంది.  
Go Back to Shorts
Tirumala
Brahmotsavalu
cm
kcr
jagan

More Telugu News