Telangana: ముఖ్యమంత్రుల భేటీ.. జగన్ కి సాదర ఆహ్వానం పలికిన కేసీఆర్

షార్ట్స్‌లో చూడండి
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, సీఎం కేసీఆర్ లు ఈ రోజు హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ని శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసిన కేసీఆర్ సాదరంగా ఆహ్వానం పలికారు. కేసీఆర్ తో పాటు టీఆర్ఎస్ నేత వినోద్ తదితరులు ఉన్నారు. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల అధికారులు కూడా పాల్గొన్నారు. రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ, కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం, నాగార్జునసాగర్, శ్రీశైలం జలాశయాల్లోకి గోదావరి జలాలను ఎత్తిపోయడంపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు.
Go Back to Shorts
Telangana
Andhra Pradesh
cm
kcr
Jagan

More Telugu News