బిగ్‌బాస్ హౌస్ నుంచి హిమజను బయటకు పంపిన ‘గద్దలకొండ గణేశ్’
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బిగ్‌బాస్ హౌస్ నుంచి హిమజను బయటకు పంపిన ‘గద్దలకొండ గణేశ్’

  • ఫేక్ ఎలిమినేషన్‌తో బయటకు వచ్చి తిరిగి సీక్రెట్ రూములోకి వెళ్లిన రాహుల్
  • అతి తక్కువ ఓట్లు రావడంతో హిమజ అవుట్
  • హౌస్‌లో ‘గద్దలకొండ గణేశ్’ సందడి
రసవత్తరంగా సాగుతున్న తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ నుంచి ఆదివారం నటి హిమజ ఎలిమినేట్ అయింది. శనివారం నాటి ఎపిసోడ్‌లో రాహుల్ ఎలిమినేట్ అయినట్టు చూపించి అందరికీ షాకిచ్చిన బిగ్‌బాస్.. ఆ తర్వాత ఫేక్ ఎలిమినేషన్ అంటూ ట్విస్టిచ్చి తిరిగి సీక్రెట్ రూములోకి పంపించాడు. ఈవారం నామినేషన్లలో రాహుల్, హిమజ, మహేష్ విట్టాలు ఉండగా హిమజ ఎలిమినేట్ అయినట్టు ‘గద్దలకొండ గణేశ్’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆదివారం షోకు వచ్చిన నటుడు వరుణ్ తేజ్ ప్రకటించాడు.  

నిజానికి నామినేషన్లలో తొలుత హిమజ పేరు లేదు. హిమజ నామినేట్ కాకుండా ఉండాలంటే వరుణ్ పేడ తొట్టెలో పడుకోవాలని బిగ్‌బాస్ షరతు విధించాడు. అందుకు వరుణ్ ఓకే అనడంతో హిమజ నామినేషన్ నుంచి బయటపడింది. అయితే, హౌస్ కెప్టెన్ అయిన వితిక తనకున్న ప్రత్యేక అధికారంతో హిమజను నామినేట్ చేసింది. ఈ వారం హిమజ, రాహుల్ సిప్లిగంజ్, మహేశ్ విట్టాలు నామినేట్ కాగా,  అత్యంత తక్కువ ఓట్లు రావడంతో హిమజ హౌస్‌ను వీడాల్సి వచ్చింది. కాగా, ఫేక్ ఎలిమినేషన్‌తో బయటకు వెళ్లి తిరిగి హౌస్‌లోకి వచ్చిన రాహుల్.. ప్రస్తుతం సీక్రెట్ రూములోనే ఉన్నాడు. అతడు మరో రెండు రోజుల తర్వాత  బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టే అవకాశం ఉంది.
Big Boss
star maa
Himaja

More Telugu News