ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ఇంటికి వెళ్లిన కేంద్ర మంత్రి

  • రాధాకృష్ణను కలిసిన ధర్మేంద్ర ప్రధాన్
  • సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా భేటీ
  • ఆర్టికల్ 370 రద్దుకు గల కారణాలను వివరించిన వైనం
ఏబీఎన్, ఆంధ్రజ్యోతి మీడియా సంస్థల అధినేత రాధాకృష్ణను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కలిశారు. హైదరాబాదులోని రాధాకృష్ణ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన వెంట తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్సీ రాంచందర్ రావు, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఉన్నారు. ఆర్టికల్ 370 రద్దుకు గల కారణాలను ఈ సందర్భంగా రాధాకృష్ణకు ధర్మేంద్ర ప్రధాన్ వివరించారు. సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంలో దేశంలోని ప్రముఖులను కేంద్ర మంత్రులు కలుస్తున్నారు. ఇందులో భాగంగానే ఆంధ్రజ్యోతి ఎండీని కేంద్ర మంత్రి కలిశారు.
Go Back to Shorts
Andhra Jyothy
ABN
Radhakrishna
Dharmendra Pradhan

More Telugu News