'బాత్రూంలో బాబాయికి గుండెపోటు' ఈవెంట్ ను బాగా రక్తి కట్టించారు శకుని మామా!: బుద్ధా వెంకన్న

షార్ట్స్‌లో చూడండి
టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ అంత్యక్రియల సందర్భంగా చంద్రబాబు తన ఈవెంట్ మేనేజ్ మెంట్ స్కిల్స్ ను అద్భుతంగా ప్రదర్శించారని  వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు.

ఇటీవల మీరు చేసిన 'బాత్రూంలో బాబాయికి గుండెపోటు' ఈవెంటును కూడా బాగా రక్తి కట్టించారని... వైసీపీ శవ రాజకీయాలను చూసి ఇప్పటికే అనేక సార్లు ప్రజలు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు శకుని మామా అంటూ ఎద్దేవా చేశారు. 'బెస్ట్ డెడ్ బాడీ ఈవెంట్ మేనేజర్లుగా మీ దొంగబ్బాయి జగన్ కి, మీకు అవార్డులు వచ్చిన సంగతి మర్చిపోయారా శకుని మామా?' అని వ్యాఖ్యానించారు. మహామేత శవం దొరక్కముందే దొంగబ్బాయిని సీఎం చేయాలని మీ ఆధ్వర్యంలో జరిగిన సంతకాల సేకరణ, ఓదార్పు యాత్ర బెస్ట్ ఈవెంట్స్ గా నిలిచాయి కదా? అని అన్నారు.
Go Back to Shorts
Budda Venkanna
Vijayasai Reddy
Jagan
Telugudesam
YSRCP

More Telugu News