యురేనియం తవ్వకాలపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- కాంగ్రెస్, టీఆర్ఎస్ పై కిషన్ రెడ్డి ధ్వజం
- కాంగ్రెస్ హయాంలోనే యురేనియంపై పరిశోధనలు
- యురేనియం తవ్వకాలపై గతంలో టీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది
అయినా, కేంద్రం అనుమతిచ్చింది యురేనియం అన్వేషణకు మాత్రమేనని, దేశ ఖనిజ సంపదపై డేటా బేస్ తయారు చేయడం ప్రభుత్వ బాధ్యత అని చెప్పారు. ఖనిజ సంపదపై పరిశోధనలు మాత్రమే జరుగుతున్నాయని, యురేనియం తవ్వకాలపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. యురేనియం తవ్వకాలకన్నా, బొగ్గు తవ్వకాలతోనే ఎక్కువ నష్టం వాటిల్లుతోందని మంత్రి వ్యాఖ్యానించారు.