పాకిస్థాన్‌లో హిందూ యువతుల కిడ్నాప్: కలకలం రేపుతున్న వార్త
- గడచిన నాలుగు నెలల్లో 30 మంది అదృశ్యం
- హిందూ యువతులే లక్ష్యం
- పాకిస్థాన్ ముస్లిం లీగ్ నేత అసెంబ్లీ సాక్షిగా ప్రస్తావన
ఈ నేపథ్యంలోనే ఖేల్ దాస్ కోహిస్తానీ ఆరోపణలు సంచలనంగా మారాయి. అసలే దాయాది దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. ఇలాంటి సమయంలో బయటకు వచ్చిన ఈ వార్త కలకలం రేపుతోంది. నవాజ్ పార్టీకి చెందిన ఖేల్ దాస్ కోహిస్తానీ పాక్ పార్లమెంట్‌లో ప్రసంగిస్తూ హిందూ మహిళల పట్ల ఎన్నాళ్లు ఈ అకృత్యాలు కొనసాగిస్తారన్నారు.
సింధు ప్రావిన్సులోని గోట్కీ, ఉమర్‌కోట్ ప్రాంతంలోనే ఎందుకు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ప్రశ్నల వర్షం కురిపించారు. ఇందుకు బాధ్యులైన వారిని అరెస్టు చేయాలని, లేదంటే ఇది ఇక్కడితో ఆగదని, మొత్తం సింధు ప్రాంతానికి ఈ మంటలు పాకుతాయని హెచ్చరించారు.