టీ20ల్లో కోహ్లీ మరో ఘనత.. రోహిత్ రికార్డు బద్దలు
- టీ20ల్లో అత్యధిక పరుగుల వీరుడిగా కోహ్లీ
- రోహిత్‌ను రెండో స్థానంలోకి నెట్టేసిన కెప్టెన్
- 71 మ్యాచుల్లోనే ఘనత
2,434 పరుగులతో రోహిత్ ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉండగా, నిన్నటి మ్యాచ్‌లో 72 పరుగులు చేసిన కోహ్లీ 2,441 పరుగులతో ఆ రికార్డును బద్దలుగొట్టి రోహిత్‌ను కిందికి నెట్టేశాడు. రోహిత్ 97 మ్యాచుల్లో ఈ ఘనత సాధించగా, కోహ్లీ 71 మ్యాచుల్లోనే ఈ మైలురాయిని చేరుకోవడం గమనార్హం. ఇక, ఈ జాబితాలో కోహ్లీ, రోహిత్ తర్వాతి స్థానంలో మార్టిన్ గప్టిల్ (2,283), షోయబ్ మాలిక్ (2,263), బ్రెండన్ మెకల్లమ్ (2,140)లు టాప్-5లో కొనసాగుతున్నారు.