YSRCP: తోట త్రిమూర్తులు ఎప్పటికీ నాకు శత్రువే: డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్

షార్ట్స్‌లో చూడండి
ఇటీవలే టీడీపీని వీడి వైసీపీలో చేరిన తోట త్రిమూర్తులపై ఆ పార్టీకే చెందిన నేత, డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తోట త్రిమూర్తులు ఎప్పటికీ తనకు శత్రువేనని అన్నారు.

గతంలో వెంకటాయపాలెంలో శిరోముండనం కేసుకు సంబంధించి దళితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, తోట త్రిమూర్తులు తమ పార్టీలోకి వచ్చినంత మాత్రాన ఈ కేసు విషయంలో ఏదైనా తేడా జరుగుతుందని బాధితులు భావిస్తే కనుక వారిని సీఎం జగన్ దగ్గరకు తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అవసరమైతే దళితుల తరఫున ధర్నా చేసేందుకు తాను సిద్ధమని, వైసీపీకి అండగా ఉన్న దళితులను తాము వదులుకోమని స్పష్టం చేశారు.

కాగా, 1996లో రామచంద్రపురం మండలంలోని వెంకటాయపాలెంలోని కొందరు దళితులకు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న తోట త్రిమూర్తులు, ఆయన అనుచరులు కలిసి శిరోముండనం చేయించారు. ఈ సంఘటనపై నాడు కేసు నమోదు చేశారు. ఈ కేసు పలు కారణాలతో వాయిదాలు పడుతూ వస్తోంది.
Go Back to Shorts
YSRCP
Thota Trimurthulu
Pilli
Ap
Deputy cm

More Telugu News