వచ్చేనెలలో సెట్స్ పైకి 'కార్తికేయ 2'
- గతంలో వచ్చిన 'కార్తికేయ' హిట్
- సీక్వెల్ కి జరుగుతోన్న సన్నాహాలు
- వచ్చేనెల 2వ వారంలో షూటింగ్ మొదలు
ప్రీ ప్రొడక్షన్ పనులు చివరిదశకు చేరుకున్నాయి. అక్టోబర్ 2వ వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలెట్టనున్నారు. ఈ సినిమాలో కథానాయికగా 'శ్రుతి శెట్టి'ని తీసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. అందులో నిజం లేదనేది తాజా సమాచారం. కథానాయిక ఎవరనేది త్వరలోనే తెలియజేస్తారట. కొంతకాలంగా సక్సెస్ కి దూరమైన చందూ - నిఖిల్ ఇద్దరూ కూడా 'కార్తికేయ 2'తో మళ్లీ హిట్ కొడతారేమో చూడాలి.