ఆనంద క్షణాలు ఆవిరైన వేళ... ప్రమాదం జరగడానికి 5 నిమిషాల ముందు తీసిన వీడియో!
- ఆటపాటలతో సందడి చేసిన పర్యాటకులు
- సెల్ఫీలు దిగుతూ ఉత్సాహం
- చివరి క్షణాల్లో తీసిన వీడియో బయటకు
ఇంతలోనే పెద్ద కుదుపు. ఏం జరిగిందా? అని చూసేలోగానే గోదావరి జలాల్లో బోటు మునిగిపోవడంతో ఒక్కసారిగా హాహాకారాలు.. అరుపులు.. కేకలు.. ఆ కాసేపటికి అవన్నీ ఆగిపోయాయి. అప్పటి వరకు సందడి నెలకొన్న ప్రాంతంలో కాసేపు నిశ్శబ్దం. గోదావరిలో బోటు ప్రమాదానికి ఐదు నిమిషాల ముందు బోటులోనే ప్రయాణించిన ఓ పర్యాటకుడు తీసిన వీడియోను ఒకటి ఇప్పుడు న్యూస్ చానెళ్లు ప్రసారం చేస్తున్నాయి. ఇందులో గోదావరిలో బోటు వెళుతున్న వేళ, అదే బోటులో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించిన దృశ్యాలున్నాయి.