మోదీపై పాముల్ని ప్రయోగిస్తానని చెప్పిన పాక్ గాయనికి లీగల్ చిక్కులు!
- వీడియోలో ప్రమాదకర సర్పాలతో కనిపించిన పాప్ సింగర్ రబీ పీర్జాదా
- చట్టం ఉల్లంఘనే అంటున్న పాక్ పంజాబ్ ప్రావిన్స్ అటవీశాఖ
- రబీ పీర్జాదాకు నోటీసులు
అయితే, ఈ వీడియోలో ఆమె ఉపయోగించింది వన్యప్రాణులు కావడంతో ఈ విషయాన్ని పాక్ పంజాబ్ ప్రావిన్స్ కు చెందిన అటవీశాఖ తీవ్రంగా పరిగణించింది. నిషేధిత వన్యప్రాణులను కలిగివుందన్న కారణంగా రబీ పీర్జాదాకు నోటీసులు పంపారు. ఈ వ్యవహారంలో ఉల్లంఘన నిరూపితమైతే రెండు లేదా మూడేళ్లు జైలు శిక్ష కానీ, రూ.20,000 వరకు జరిమానా కానీ చెల్లించాల్సి ఉంటుంది.