రక్తపోటులో హెచ్చుతగ్గులకు వేడిమి చికిత్సతో చెక్
- అమెరికా శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడి
- మంచంపై 100 ఫారెన్ హీట్ డిగ్రీల వేడిని ఉత్పత్తి చేసే ప్యాడ్‌లు
- రక్తపోటులో తగ్గిన హెచ్చుతగ్గులు
పరిశోధనలో భాగంగా 76 ఏళ్ల సగటు వయసున్న వ్యక్తులపై అధ్యయనం నిర్వహించారు. అధ్యయనంలో భాగంగా ఒకరు నిద్రించే మంచంపై 100 ఫారన్ హీట్ డిగ్రీల వేడిని ఉత్పత్తి చేసే ప్యాడ్‌లను అమర్చారు. మరొకరి మంచంపై సాధారణ ప్యాడ్‌లను ఏర్పాటు చేశారు. వేడిని ఉత్పత్తి చేసే ప్యాడ్‌లు అమర్చిన మంచంపై నిద్రించిన వ్యక్తిలో రక్తపోటు సాధారణ స్థితికి రాగా, సాధారణ మంచంపై నిద్రించిన వ్యక్తిలో రక్తపోటు అలానే ఉన్నట్టు పరిశోధనకారులు గుర్తించారు.