Dokka: ఉపాధి హామీ కూలీలకు 3 రోజుల్లో డబ్బు చెల్లించకపోతే 12 శాతం వడ్డీ కలిపి ఇవ్వండి: డొక్కా మాణిక్య వరప్రసాద్ డిమాండ్

షార్ట్స్‌లో చూడండి
ఉపాధి హామీ కూలీల కష్టాలపై టీడీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ స్పందించారు. వీరికి 3 రోజుల్లో డబ్బు చెల్లించకపోతే 12 శాతం వడ్డీ కలిపి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ నిధులను జగన్ సర్కారు పక్కదారి పట్టిస్తోందని డొక్కా ఆరోపించారు. ఉపాధి హామీ కూలీలకు డబ్బు చెల్లించకుండా, కేంద్రం పంపిన నిధులను ఏంచేస్తున్నారో చెప్పాలని నిలదీశారు. పరిస్థితి ఇలాగే ఉంటే కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Go Back to Shorts
Dokka
Telugudesam
YSRCP
Jagan

More Telugu News