ప్రతిరోజూ నేను పోలీసులతో మాట్లాడాల్సిన పరిస్థితులు వస్తున్నాయి: కన్నా లక్ష్మీనారాయణ

  • వైసీపీ సర్కారు చంద్రబాబును మించిపోతోందంటూ వ్యాఖ్యలు
  • తనను సచివాలయ ఉద్యోగులు కలిశారన్న కన్నా
  • మూడ్నెల్లకే చేతులెత్తేసే పరిస్థితి వచ్చిందంటూ విమర్శలు
ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో చంద్రబాబు చేసిన తప్పులకన్నా ఇప్పుడు వైసీపీ చేస్తున్న తప్పులే అధికంగా ఉన్నాయని విమర్శించారు. బీజేపీలో చేరుతున్న నేతలను వైసీపీ వేధింపులకు గురిచేస్తోందని ఆరోపించారు. పల్నాడులో బీజేపీ నేతలను పోలీస్ స్టేషన్లో పెట్టి హింసిస్తున్నారని మండిపడ్డారు. ఇతర ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో తాను ప్రతిరోజు పోలీసులతో మాట్లాడాల్సిన పరిస్థితులు వస్తున్నాయని అన్నారు.

తాజాగా తనను సచివాలయ ఉద్యోగులు కలిశారని, పదోన్నతులలో అన్యాయం జరుగుతోందని వారు తన వద్ద వాపోయారని కన్నా వెల్లడించారు. వైసీసీ సర్కారు తీరు చూస్తుంటే మూడు నెలలకే చేతులు ఎత్తేసే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు.
Go Back to Shorts
Kanna
BJP
Andhra Pradesh
Chandrababu
YSRCP
Jagan

More Telugu News