సంస్థ తమకు జీతాలు ఇవ్వడం లేదంటూ.. ‘ట్రాన్స్ ట్రాయ్’ ఉద్యోగుల నిరసన.. ప్రభుత్వానికి ఫిర్యాదు!
- పోలవరం ప్రాజెక్టుకు పాత కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్ ట్రాయ్
- ‘ట్రాన్స్ ట్రాయ్’ ఈడీని అడ్డుకున్న సబ్ కాంట్రాక్టర్లు
- బిల్లులు పాస్ కాగానే బకాయిలు చెల్లిస్తామన్న ఈడీ
రూ.23 కోట్ల బకాయిలు చెల్లించకుండా వేధిస్తున్నారని, డబ్బులు అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితులు ఆరోపించారు. బకాయిలు చెల్లించకపోవడంతో ఇప్పటికే ఇద్దరు ఆత్మహత్యాయత్నం చేశారని, ఈ సమస్య పరిష్కారానికి సీఎం జగన్ చొరవ చూపాలని బాధితులు కోరారు. కంపెనీ ఇబ్బందుల్లో ఉండటం వల్లే బకాయిలు చెల్లించలేకపోయామని, బిల్లులు పాస్ కాగానే ఎండీతో మాట్లాడి చెల్లిస్తామని సాంబశివరావు చెప్పినట్టు సమాచారం.