భక్తులతో కిటకిటలాడుతున్న నెల్లూరు స్వర్ణాల చెరువు... వైభవంగా గంధ మహోత్సవం!
- నెల్లూరులో ఘనంగా రొట్టెల పండగ
- అమరవీరులకు గంధం సమర్పించిన పెద్దలు
- పలు రకాల రొట్టెలను మార్చుకుంటున్న భక్తులు
ఇక రొట్టెల పండగలో అత్యంత ముఖ్యమైన గంధ మహోత్సవం ఈ ఉదయం వైభవంగా జరుగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి గంధాన్ని తెచ్చిన ముస్లిం పెద్దలు, దాన్ని అమరవీరులకు సమర్పించారు. ఈ కార్యక్రమాన్ని కడప పీఠాధిపతి అరిపుల్లా హుస్సేని స్వయంగా పర్యవేక్షించారు. అమరులకు సమర్పించిన గంధాన్ని దక్కించుకునేందుకు భక్తులు పోటీ పడుతున్నారు.
కాగా, ఈ సంవత్సరం సంతానం, వివాహం, ఉద్యోగం రొట్టెలకు భారీ డిమాండ్ కనిపిస్తోంది. దీంతో పాటు వీసా, విదేశీ ప్రయాణం, ఉన్నత చదువుల రొట్టెలనూ భక్తులు మార్చుకుంటున్నారు.