వైసీపీ ఎమ్మెల్యేకు తెల్ల రేషన్ కార్డు... స్వయంగా చెప్పుకుని విమర్శల పాలు!
- తెల్ల రేషన్ కార్డుల దుర్వినియోగం
- పలాస ఎమ్మెల్యే అప్పలరాజుకు రేషన్ ఇచ్చిన వలంటీర్
- ఫోటోలు బయటకు రావడంతో విషయం వెలుగులోకి
ఇక తనపై వస్తున్న విమర్శలకు వివరణ ఇచ్చిన అప్పలరాజు, ఆధార్ కార్డులు రావడానికి ముందు తాను పింక్ కార్డు కోసం దరఖాస్తు చేశానని, ఆపై కొన్నాళ్లకు తనకు కార్డు వచ్చిందని, అది తెల్లకార్డని కూడా తనకు తెలియదని అన్నారు. తనకు కార్డు వచ్చిన తరువాత రెండు ప్రభుత్వాలు మారిపోయాయని, తన కార్డును క్యాన్సిల్ చేయాలని పలాస ఎమ్మార్వోకు చెప్పానని అన్నారు.
ఇదిలావుండగా, ఆయన వివరణపై నెటిజన్లు ఏ మాత్రం సంతృప్తిగా లేరు. ఎమ్మెల్యేకు తెల్ల రేషన్ కార్డు ఏంటంటూ కామెంట్లు వస్తున్నాయి. ఆయన గ్యాస్ సిలిండర్ ను కూడా పరిశీలించాలని, అది కూడా సబ్సిడీపైనే ఉండి వుంటుందని అంటున్నారు. ఎమ్మెల్యే స్థాయిలోని వ్యక్తికి తెల్ల రేషన్ కార్డుంటే, నెలకు 50 వేల వేతనం తీసుకునే ఉద్యోగికి కూడా తెల్ల కార్డే ఉండాలని, ఆ మేరకు నిబంధనలను సవరించాల్సిందేనని కూడా పలువురు అంటున్నారు.